News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

కర్నూలు జిల్లాలో గ్యాస్ కొరత లేదు: JC

image

కర్నూలు జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 11వేల సిలిండర్లు నిల్వలో ఉండగా, అదనంగా 7వేల సిలిండర్లు చేరుకున్నాయన్నారు. ప్రతిరోజు సగటున 10వేల సిలిండర్లు వినియోగదారులకు పంపిణీ జరుగుతోందన్నారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. ఏజెన్సీలు ఇబ్బందులు కలిగిస్తే 1967 టోల్ ఫ్రీ నంబర్‌‌ను సంప్రదించాలన్నారు.

News March 16, 2026

పెండింగ్‌ కేసులపై దృష్టి సారించండి: భద్రాద్రి ఎస్పీ

image

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్ రాజు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో SHOలు, కోర్టు డ్యూటీ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. న్యాయాధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం పాటిస్తూ, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పాత కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

News March 16, 2026

VZM: కలెక్టరేట్‌లో ప్రజల నుండి 233 వినతుల స్వీకరణ

image

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. మొత్తం 233 వినతులు అందగా అందులో 130 రెవెన్యూ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. వినతులను సకాలంలో పరిష్కరించాలని, ఆలస్యం సహించబోమని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.