News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 16, 2026

నేడు అమరావతిలో ‘అమరజీవి’ విగ్రహావిష్కరణ

image

AP: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి నేడు. 58 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేసినందుకు గుర్తుగా అమరావతిలోని తుళ్లూరులో 58 అడుగుల విగ్రహాన్ని CM చంద్రబాబు నేడు ఆవిష్కరించనున్నారు. ₹150 కోట్ల అంచనా వ్యయంతో 6.8 ఎకరాల్లో చేపట్టిన స్మృతి వనం తొలి దశ పనులు పూర్తయ్యాయి. రెండో దశలో మ్యూజియం, ఫొటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌‌మెంట్ సెంటర్ నిర్మిస్తారు.

News March 16, 2026

మదనపల్లిలో ఎస్పీ కార్యాలయం ప్రారంభం

image

మదనపల్లెలో ఎస్పీ కార్యాలయాన్ని స్థానిక బెంగళూరు రోడ్డులో ఆదివారం ప్రారంభించారు. ఉదయం వేద పండితులతో కలిసి
అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభించి, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

News March 16, 2026

నెల్లూరు జిల్లాలో విషాదం

image

పొదలకూరు మండలం మరుపూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రదీప్ (14) అనే బాలుడు ఆదివారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి వెళ్లి పాత తాగునీటి బావిలో మునిగి మృతి చెందాడు. సుమారు 25 అడుగుల లోతు ఉన్న బావిలో డైవింగ్ చేసిన తర్వాత పైకి రాకపోవడంతో గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. ఈఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.