News March 29, 2024
ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట

ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరును టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పటివరకు ఒంగోలు వైసీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవలే చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు.
Similar News
News September 30, 2025
కనిగిరి కలెక్టర్ మీకోసంకు 814 అర్జీలు

కనిగిరిలో సోమవారం నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి 814 అర్జీలు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని అర్జీదారులు భారీ ఎత్తున తరలివచ్చారు. కాక ఈ అర్జీలలో 60 నుండి 70 శాతం వరకు రెవెన్యూ సంబంధమైన సమస్యలే కావడంతో, వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News September 29, 2025
గిద్దలూరు: 55 ఏళ్ల తర్వాత కలిశారు

ప్రకాశం జిల్లాలో అరుదైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గిద్దలూరులోని ఓ ప్రైవేట్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో 1969-70 విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరగింది. 55 సంవత్సరాల అనంతరం కలిసిన స్నేహితులు తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి తెలుసుకున్నారు.
News September 29, 2025
ప్రకాశం పోలీస్ పవర్.. ఒకేరోజు 80 మంది అరెస్ట్.!

ప్రకాశం జిల్లాలోని 16 ప్రదేశాల్లో పోలీసులు దాడులు నిర్వహించి ఏకంగా 80 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం ఆదివారం ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం విస్తృతంగా పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 74 మందిని గుర్తించి కేసులు సైతం నమోదు చేశారు.