News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 1, 2026
HNK: చెట్టును ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

HNK(D) ధర్మసాగర్ మండలం దేవనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులు కారులో ప్రయాణిస్తుండగా, నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
News April 1, 2026
సెన్సస్: మోదీ సెల్ఫ్ ఎన్యూమరేషన్

దేశవ్యాప్తంగా తొలి దశ జనగణనలో భాగంగా ఇవాళ్టి నుంచి హౌస్ లిస్టింగ్, హౌసింగ్ ఆపరేషన్స్ నమోదు ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ <<19530324>>సెల్ఫ్ ఎన్యూమరేషన్<<>> పూర్తి చేశారు. ఈ ఫొటోలను SMలో పోస్టు చేశారు. ‘సెన్సస్ పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతుండటం ఇదే తొలిసారి. ఇంటి వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం ఉంది. దేశ ప్రజలంతా ఇందులో భాగం కావాలి’ అని పిలుపునిచ్చారు.
News April 1, 2026
మెదక్ జిల్లాలో LPG గ్యాస్ కొరత లేదు

మెదక్ జిల్లాలో ఎక్కడా LPG గ్యాస్ కొరత లేదని జిల్లా పౌర సరఫరాధికారి నిత్యానంద్ తెలిపారు. 16 ఏజెన్సీల ద్వారా రోజుకు సుమారు 3,200 సిలిండర్లు బుకింగ్ కాగా, 100% డెలివరీ జరుగుతోందన్నారు. గోదాముల్లో 3,500 సిలిండర్లు ఉండగా, 6,179 ట్రాన్సిట్‌లో ఉన్నాయన్నారు. టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు కమర్షియల్ సిలిండర్లనే వాడాలని, డొమెస్టిక్ వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


