News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
తగ్గేదే లే.. యుద్ధం కొనసాగుతుంది: నెతన్యాహు

పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌పై దాడులకు US అధ్యక్షుడు ట్రంప్ బ్రేక్ ఇచ్చినా తాము మాత్రం ఆగేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్, లెబనాన్‌పై దాడులు కొనసాగుతాయన్నారు. కాగా దాడుల్లో సాధించిన విజయాలే డీల్‌లో పైచేయి సాధించడానికి కీలకం అవుతాయని భావిస్తున్నట్లు ట్రంప్ తనతో చెప్పారని తెలిపారు.
News March 24, 2026
టీజీ ఎప్‌సెట్‌కు 2,20,879 దరఖాస్తులు

టీజీ ఎప్‌సెట్‌కు దరఖాస్తులు ఊపందుకున్నాయి. ఇంటర్ వార్షిక పరీక్షలు ముగియడంతో దరఖాస్తులు జోరందుకున్నాయి. సోమవారం వరకు 2,20,879 మంది దరఖాస్తు చేసుకున్నారు. విభాగాలవారీగా తీసుకొంటే ఇంజినీరింగ్‌కు 1,55,804మంది, అగ్రికల్చర్& ఫార్మసీ విభాగానికి 64,866, 2 పేపర్లకు హాజరయ్యేందుకు 209 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 13 వరకు 1.3లక్షల దరఖాస్తులు రాగా, ఇప్పటివరకు 2.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
News March 24, 2026
వరంగల్ జిల్లాలో టీబీ కేసులు.. వైద్యుల సూచనలు

జిల్లాలో టీబీ (క్షయ) కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది 73,991 మందికి పరీక్షలు చేయగా 1,260 మందికి టీబీ నిర్ధారణ అయింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3,780 మందికి పరీక్షలు నిర్వహించగా 287 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం సుమారు 876 మంది చికిత్స పొందుతున్నారు. దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
# నేడు ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం


