News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
NZB: ఆ కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తింపజేయాలి: కలెక్టర్

వలస కార్మికులకు హక్కులు, ప్రయోజనాలు వర్తించేలా సంబంధిత శాఖల అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన సోమవారం కలెక్టరేట్‌లో వలస కార్మికుల సంక్షేమంపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, తదితర చోట్ల పనిచేసే కార్మికులకు యాజమాన్యాలు తగిన సదుపాయాలు, కనీస వేతనాలు అమలు చేసేలా పర్యవేక్షించాలన్నారు.
News March 16, 2026
NZB: సమయపాలన పాటించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశం

ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యే అధికారులు సమయపాలన పాటించాలని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలువురు అధికారులు ఆలస్యంగా హాజరు కావడాన్ని గమనించిన కలెక్టర్ కార్యక్రమం ప్రారంభం అయ్యే నిర్ణీత సమయం ఉదయం 10.30 గంటల వరకు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు. సోమవారం ప్రజావాణిలో 80 వినతులు అందగా వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు.
News March 16, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారు వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,670
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,416
* వెండి 10 గ్రాముల ధర రూ.2585.


