News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 27, 2026
ఇందూరు కోటపై కొలువుదీరిన కోదండరాముడు

ఇందూరు కోటపై వెలసిన శ్రీ రఘునాథ ఆలయానికి శతాబ్దాల ఘన చరిత్ర ఉంది. పన్నెండో శతాబ్దంలో కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ కోట, తదనంతరం ఛత్రపతి శివాజీ పర్యవేక్షణలో పునర్నిర్మాణానికి నోచుకుంది. శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థ రామదాసు ఇక్కడ తపస్సు చేశారని, ఆయన కోరిక మేరకే ఈ ఆలయం నిర్మించారని ప్రతీతి. ఇక్కడి కోదండరాముడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు.
News March 27, 2026
ఈ శ్రీరాముడి గుణాలే తారకమంత్రం!

శ్రీరాముడి నాయకత్వ లక్షణాలు నేటికీ ఆదర్శమే. ఎన్ని కష్టాలొచ్చినా నమ్మిన ధర్మాన్ని, విలువలను పక్కనపెట్టలేదు. భరతుడికి కబురు పంపితే రావణుడిపై దండెత్తడానికి మహాసైన్యమే వచ్చేది. కానీ 14ఏళ్ల వనవాసానికి భంగం కలగొద్దని వానరులనే రామదండుగా మార్చుకున్నాడు. ఉన్న వనరులతోనే విజయాలు సాధించొచ్చనడానికి ఇదో ఉదాహరణ. నిజాయతీ, నిబద్ధత, సమానత్వం, సమయపాలన పాటిస్తూ ఏ పని ఎవరికి అప్పగించాలో గ్రహించగలిగే సమర్థుడు రాముడు.
News March 27, 2026
10 లక్షల మందితో గ్రౌండ్ వార్‌కు ఇరాన్ రెడీ?

అమెరికాతో గ్రౌండ్ వార్ జరిగే ఛాన్స్ ఉందన్న వార్తలతో ఇరాన్ అలర్ట్ అయింది. ఏకంగా 10 లక్షల మంది ఫైటర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బసిజ్, IRGC రిక్రూట్‌మెంట్ సెంటర్లకు వాలంటీర్లు భారీగా క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. అటు అమెరికా కూడా తన ఎలైట్ ఫోర్సెస్‌ను పశ్చిమాసియాకు పంపేందుకు ప్లాన్ చేస్తోంది. ట్రంప్ చర్చల గురించి చెబుతున్నా ఇరాన్ మాత్రం అప్రమత్తంగా వ్యవహరిస్తూ యుద్ధానికి సిద్ధమవుతోంది.


