News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 20, 2026

MBNR: రంజాన్ ఎంతో పవిత్రమైనది: ఎస్పీ

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ముస్లింలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అందరి జీవితాల్లో ఆనందం, శాంతిని నింపాలని ఆమె ఆకాంక్షించారు. ఉపవాస దీక్షల ద్వారా పొందే ఆత్మశుద్ధి, సహనం, సేవాభావం సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు.

News March 20, 2026

విద్యుత్ భద్రతకు లైన్ క్లియర్ యాప్: ఎస్ఈ

image

విద్యుత్ వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించడంతో పాటు క్షేత్రస్థాయి ఉద్యోగుల భద్రతను పటిష్టపరిచేందుకు ఎల్సీ (లైన్ క్లియర్) యాప్‌ తీసుకొచ్చామని ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ ఎస్ఈ పి.మధుసూదన్ రావు తెలిపారు. ఈ యాప్ విద్యుత్ రంగంలో పనిచేసే సిబ్బంది భద్రతకు అత్యంత కీలకంగా మారిందని అన్నారు. తప్పుడు ఫీడర్ ఎంపిక, పంపిణీ వ్యవస్థపై అస్పష్టత, సమాచార లోపం విషయాల్లో భద్రతగా ఉంటుందన్నారు.

News March 20, 2026

రెండు వారాల్లో వీటన్నింటి ధరలు పెరిగాయ్: కాంగ్రెస్

image

ప్రధాని మోదీ హయాంలో దేశంలో అన్ని ధరలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గత రెండు వారాల్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.146, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60, రిఫైన్డ్ ఆయిల్ రూ.30/L, పామ్ ఆయిల్ రూ.15/L, ఇండస్ట్రియల్ డీజిల్ రూ.22/L, ప్రీమియం పెట్రోల్ రూ.2.35/L, జొమాటో డెలివరీ ఫీ రూ.2.40, విమాన టికెట్లు రూ.425-2,300, ప్లాస్టిక్ బాటిల్ సెట్ రూ.40, ఇండక్షన్ స్టవ్ ధర 40% పెరిగిందని పేర్కొంది.