News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 31, 2026

బందరులో బాలిక పట్ల అసభ్యకర ప్రవర్తన.. నిందితుడికి దేహశుద్ధి

image

బందరులోని ఓ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆటో డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాజుపేటకు చెందిన ఆటో డ్రైవర్ అబ్దుల్ ఖలీల్ అదే ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఎవ్వరూ లేని సమయంలో అతను ఆ బాలికను పట్టుకుని నీచంగా వ్యవహరించాడు. దీంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 31, 2026

యర్నగూడెం హైవేపై యాక్సిడెంట్..ఓ వ్యక్తి స్పాట్ డెడ్

image

యర్నగూడెం NH16పై సోమవారం రాత్రి జరిగిన యాక్సిడెంట్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడు. దేవరపల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపిన వివరాల మేరకు..గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో సుమారు 30-40 ఏళ్లున్న వ్యక్తి స్పాట్‌లో మరణించాడని చెప్పారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96624, 94407 96584 నంబర్లను సంప్రదించాలన్నారు.

News March 31, 2026

మొబైల్ డేటాను తెగ వాడేస్తున్నారు

image

గతేడాది దేశంలో ఒక్కో వ్యక్తి నెలవారీ సగటు మొబైల్ డేటా వినియోగం 31GBగా(2024లో 27.5GB) ఉందని నోకియా నివేదిక వెల్లడించింది. టోటల్ మంత్లీ డేటా వాడకం 27 ఎక్సాబైట్లు(ఒక ఎక్సాబైట్=100 కోట్ల GB) దాటిందని తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ ట్రాఫిక్‌లో 5G వాటా 47%గా ఉందంది. AI అప్లికేషన్స్, 4K వీడియోల స్ట్రీమింగ్, క్లౌడ్ గేమింగ్ కారణంగా డేటా వాడకం పెరిగిందని పేర్కొంది.
* మీరు డేటాను ఎక్కువగా దేనికోసం వాడుతున్నారు?