News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News January 20, 2026
ఉండిలో జంట మృతదేహాల కలకలం

ఉండిలో జంట మృతదేహాల లభ్యం కావడం కలకలం రేపుతోంది. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న కొబ్బరి తోటలో సుబ్బారావు అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా, మంగళవారం నిమ్మలపేటలో విజయ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. వరుసగా రెండు మృతదేహాలు బయటపడటంతో ఇవి హత్యలా లేక ఆత్మహత్యలా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు.
News January 20, 2026
లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి? సింపుల్ ఫార్ములా..

‘10 టైమ్స్ యాన్యువల్ ఇన్‌కమ్’ అనేది ఒక వ్యక్తికి ఎంత మొత్తంలో లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండాలో లెక్కించే సులభమైన పద్ధతి. దీని ప్రకారం ఏడాది ఆదాయానికి కనీసం 10 రెట్ల లైఫ్ కవర్ ఉండాలి. Ex వార్షిక ఆదాయం ₹15 లక్షలు అయితే ₹1.5 కోట్ల విలువైన ఇన్సూరెన్స్ తీసుకోవాలి. మరణం తర్వాత కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అప్పులు లేదా అదనపు బాధ్యతలు ఉంటే మాత్రం ఇది సరిపోదు.
News January 20, 2026
తూ.గో: వరకట్న వేధింపులు.. భర్తకు 18 నెలల జైలు శిక్ష

వరకట్న వేధింపుల కేసులో ముద్దాయి కరిముల్లాకు 18 నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఏజేఎఫ్‌సీ మెజిస్ట్రేట్ వీరరాఘవరావు మంగళవారం తీర్పునిచ్చారు. ధవళేశ్వరానికి చెందిన సయ్యద్ సమీన తబసుమ్‌ను అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేయడంతో 2012లో రాజమహేంద్రవరం మహిళా పీఎస్‌లో కేసు నమోదైంది. సుదీర్ఘ విచారణ అనంతరం నేరం నిరూపితం కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది.


