News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 30, 2026
యుద్ధం.. మనకు నష్టం, ఆ దేశాలకు లాభాలు!

ఇరాన్, US యుద్ధం వల్ల ఆయిల్, గ్యాస్ దిగుమతులపై ఆధారపడిన భారత్, UK, EU, సౌత్ కొరియా, జపాన్ తీవ్రంగా నష్టపోతున్నాయి. క్రూడ్ ధరల పెరుగుదలతో మన దిగుమతి ఖర్చు పెరిగింది. రూపాయి విలువ 94.8కి పడిపోయింది. క్రూడ్ 10 డాలర్లు పెరిగితే ఇండియాపై అదనంగా $12-18B అదనపు భారం పడుతుంది. సంక్షోభానికి కారణమైన USతోపాటు రష్యా, కెనడా, నార్వే భారీగా లాభపడుతున్నాయి. ఇంధన సరఫరాతో నెలలో ఒక్కో దేశం $3-5B అదనపు ఆదాయం పొందాయి.
News March 30, 2026
రివర్ ఫ్రంట్ పనులు వేగవంతం చేయాలి: గంగుల కమలాకర్

కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ కోసం బీఆర్ఎస్ హయాంలోనే రూ. 540 కోట్లు మంజూరయ్యాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పర్యాటక శాఖ నుంచి రూ. 100 కోట్లు, నీటి పారుదల శాఖ నుంచి రూ. 440 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ చేపడుతున్న సందర్భంగా మానేరు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని, నిధులు విడుదల చేయాలని ఇన్‌ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
News March 30, 2026
సిరిసిల్ల: త్వరలో చేనేత సహకార ఎన్నికలు..!

రాష్ట్రంలో చేనేత సహకార ఎన్నికల నిర్వాహణకు సర్కార్ కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా, బకాయిదారుల వివరాలను ఏప్రిల్ 4-13 వరకు నోటీసుపై ప్రచురించనున్నారు. ఓటు హక్కు కావాలనుకుంటే వచ్చేనెల 13లోగా బకాయిలు చెల్లించాలని గడువు విధించారు. అదేనెల 18-25 వరకు ఓటరు జాబితా విడుదల చేస్తారు. జూన్‌లో చేనేత ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


