News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 3, 2026
₹167కోట్లు!.. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్

రాజా రవివర్మ పెయింటింగ్స్‌లో ఒకటైన ‘యశోద-కృష్ణ’ వేలంలో ఏకంగా ₹167.20కోట్లు పలికింది. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండీ సైరస్ పూనావాలా దీనిని దక్కించుకున్నారు. ఎంఎఫ్ హుసేన్ ‘గ్రామ్ యాత్ర’ పెయింటింగ్ రికార్డ్‌ను (₹118Cr) బ్రేక్ చేసి దేశంలోనే ఖరీదైన చిత్రంగా నిలిచింది. ఈ ఆయిల్ పెయింటింగ్‌ను రవివర్మ 1890ల్లో గీశారు. యశోద ఆవు పాలు పితుకుతుంటే బాలకృష్ణుడు పాత్రతో చేయిచాస్తున్నట్టుగా ఈ చిత్రం ఉంది.
News April 3, 2026
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ

సైబర్ నేరాల పట్ల విశ్రాంత ఉద్యోగులు, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ జి. శ్రీనివాస్ సూచించారు. సైబర్ జాగ్రూక్త దివాస్ సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ఫర్ సీనియర్ సిటిజన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, సిద్దిపేట ప్రజలు పాల్గొన్నారు.
News April 3, 2026
నిర్మల్: సీఎం పర్యటన.. కలెక్టర్ దిశానిర్దేశం

ముఖ్యమంత్రి బాసర పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేయాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సీఎం బాసర చేరుకున్న నుంచి, ఆలయ సందర్శన, పూజలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, తిరిగి వెళ్లేవరకు వివిధ శాఖల అధికారులు నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. హెలిప్యాడ్, ఆలయం లోపల, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు.


