News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

ASF: గుండెపోటుతో వార్డు మెంబర్ మృతి

image

కౌటాల మండలంలోని మొగడ్ దగడ్ గ్రామపంచాయతీ 4వ వార్డు సభ్యురాలు తారాబాయి(50) శుక్రవారం గుండెపోటుతో కన్నుమూశారు. కుటుంబీకుల కథనం ప్రకారం.. ఉదయం ఇంట్లో పని చేస్తుండగా ఆమెకు ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రజా ప్రతినిధి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 14, 2026

HNK: పల్లె సీమలు.. అభివృద్ధి వైపు అడుగులు..!

image

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. జిల్లాలో 208 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ నిధులను వర్షపు నీటి నిల్వ, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ పనులకు మాత్రమే ఉపయోగిస్తారు. 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలకు సంబంధించిన స్థానిక అభివృద్ధి పనులకు రోడ్లు, డ్రైనేజీ ఈ నిధులను వినియోగించనున్నారు. .గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళిక (GPDP) రూపొందించి, గ్రామ సభ ఆమోదంతో ఈ పనులు చేపడతారు.

News March 14, 2026

ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో నెం.1గా నిలపాలి: కలెక్టర్

image

రహదారి ప్రమాదాలను తగ్గించి, ఎన్టీఆర్ జిల్లాను రోడ్డు భద్రతలో అగ్రస్థానంలో నిలబెట్టాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, బ్లాక్ స్పాట్ల వద్ద పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా యంత్రాంగం కృషి చేయాలని పిలుపునిచ్చారు.