News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 17, 2026

పెద్దపల్లి: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి

image

పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాలకు చెందిన దంపతులు దుర్మరణం చెందారు. లయన్స్ క్లబ్, క్రెడాయి సభ్యుడైన ఎడ్ల శ్రీనివాస్, రజిత దంపతులు హైదరాబాద్‌లో చదువుకుంటున్న కూతురు రిషిత వద్దకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టగా దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. జంట మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.

News March 17, 2026

రేపటి నుంచే దివ్యాంగులకు ఉచిత ప్రయాణం!

image

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా వెళ్లొచ్చు. బస్సు ఎక్కేటప్పుడు PHC పాస్/వికలాంగుల కార్డు చూపించి జీరో టికెట్ తీసుకోవాలని RTC సూచించింది.

News March 17, 2026

MNCL: రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి