News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
FLASH: ఏసీబీ వలలో కరీంనగర్ సూపరింటెండెంట్

ఫైళ్లలో తప్పులను సరిదిద్దేందుకు లంచం డిమాండ్ చేసిన కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్ కార్యాలయ సూపరింటెండెంట్ ఇగాల మధుసూదన్‌ను ఏసీబీ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. బినామీ ఖాతా ద్వారా సుమారు ₹14.77 లక్షల మేర యూపీఐ లావాదేవీల రూపంలో లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది.
News March 16, 2026
ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టికలు తప్పనిసరి: VZM DMHO

జిల్లాలోని ప్రైవేట్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, ల్యాబ్స్, స్కాన్ సెంటర్లు తమ సేవల ధరల పట్టికలను తప్పనిసరిగా ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని DMHO ఎస్. జీవన్ రాణి సోమవారం ఆదేశించారు. స్కాన్ సెంటర్లు పీసీపీఎన్‌డీటీ చట్టం నిబంధనలు పాటిస్తూ లింగ నిర్ధారణ నేరమని తెలుపుతూ బోర్డులు ప్రదర్శించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News March 16, 2026
TU: M.Ed మూడో సెమిస్టర్ పరీక్షలు.. ఒకరు గైర్హాజరు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంఈడీ మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో పరీక్షకు 29 మంది విద్యార్థులకు 28 మంది విద్యార్థులు హాజరుకాగా ఒకరు గైర్హాజరైనట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆచార్య సంపత్ కుమార్ వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడలేదన్నారు.


