News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 21, 2026

ADB: గ్యాస్ డెలివరీలో అలస్యమైతే.. కాల్ చేయండి

image

గ్యాస్ సరఫరా, డెలివరీలో ఆలస్యం లేదా ఇతర సమస్యలు ఎదురైతే ప్రజలు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1939 అందుబాటులో ఉందని తెలిపారు. ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని, జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News March 21, 2026

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

image

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు ₹500 అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ఇదే సమయంలో వీఐపీ, ప్రొటోకాల్, బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. క్యూ లైన్లలో ఉన్న సామాన్య భక్తులు త్వరగా దర్శనం చేసుకునేలా ఈ చర్యలు చేపట్టారు. 2 గంటల తర్వాత పరిస్థితులను బట్టి తిరిగి టికెట్ల జారీ చేయనున్నారు.

News March 21, 2026

ఓరుగల్లుకు పేరు తెచ్చిన కవులు, రచయితలు

image

ఆంధ్ర‑తెలంగాణ సాహితీ చరిత్రలోనే ఓరుగల్లుకు ప్రత్యేక స్థానం ఉంది. పాల్కురికి సోమనాథుడు నుంచి బమ్మెర పోతన, కాళోజీ, దాశరథి వరకూ ప్రముఖ కవులు, రచయితలు ఈ గడ్డపైనే జన్మించారు. ప్రగతిశీల కవి దాశరథికృష్ణమాచార్యులు, టి. శ్రీరంగస్వామి, డా.రామా చంద్రమౌళి, కోవెల సుప్రసన్నాచార్యులు, అంపశయ్య నవీన్, సదానంద్ శారద, పసునూరి రవీందర్, రత్నాకర్ రావు, ఉమామహేశ్వర్ రావు, అనిశెట్టి రజిత జిల్లా కథా సాహితీ రంగంలో పేరొందారు.