News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 17, 2026
గంగ జాతరకు CM చంద్రబాబుకు ఆహ్వానం

కుప్పం శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సతీసమేతంగా రావాలంటూ CM చంద్రబాబుకు గంగమ్మ గుడి ఛైర్మన్ BMK రవిచంద్రబాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. అమరావతిలో CMను ఆయన నివాసానికి వెళ్లి జాతర ఆహ్వాన పత్రిక ఇచ్చారు. గంగ జాతరలో భాగంగా మే 20న అమ్మవారి విశ్వరూప దర్శనం రోజు CM చంద్రబాబు దంపతులు రానున్నట్లు సమాచారం.
News April 17, 2026
మెదక్: వేసవి టూర్‌కు వెళ్తున్నారా..? జాగ్రత్త !

వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని మెదక్ ప్రజలకు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. కుటుంబంతో కలిసి ఊళ్లకు వెళ్లేవారు ఇంటి భద్రతపై నిఘా ఉంచాలని, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిశితంగా గమనిస్తూ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. స్వయం జాగ్రత్తలే ఆస్తికి రక్షణ అని పేర్కొన్నారు.
News April 17, 2026
కాసేపట్లో ఓటింగ్.. బలాబలాలు ఇవే

మహిళా రిజర్వేషన్లు(రాజ్యాంగ సవరణ), డీలిమిటేషన్ బిల్లులపై కాసేపట్లో లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు 2/3 మెజారిటీ అవసరం. ప్రస్తుతం LSలో 540 మంది సభ్యులు ఉన్నారు. అంటే 360 మంది MPల మద్దతు కావాలి. NDAకి 293 మంది సభ్యుల మద్దతు ఉంది. బిల్లులు పాస్ కావాలంటే మరో 67 మంది MPల సపోర్ట్ అవసరం. అటు విపక్షాల బలం 233. ఎక్కువ మంది విపక్ష పార్టీల సభ్యులు గైర్హాజరైతే బిల్లులు పాసయ్యే ఛాన్స్ ఉంది.


