News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
బల్బ్‌లో కెమెరా.. డాక్టరే న్యూడ్ వీడియోలు తీసి

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక డాక్టర్ తన కొలీగ్‌పై ఉన్న వన్ సైడ్ లవ్‌తో నీచానికి ఒడిగట్టాడు. క్లినిక్ బల్బ్ హోల్డర్‌లో కెమెరా పెట్టి 3,000 ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేశాడు. వాటిని చూపించి ₹25 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ వేధించాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు డాక్టర్ కమల్ నందాతో పాటు మరో 12 మందిపై కేసులు నమోదు చేశారు.
News March 22, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News March 22, 2026
రంజాన్ వేళ ‘గులాబీ’ సంకేతం.. జీవన్‌రెడ్డి అడుగులు అటువైపేనా?

మాజీమంత్రి జీవన్‌రెడ్డి పార్టీ మార్పుపై సాగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. శనివారం జగిత్యాలలో జరిగిన రంజాన్ వేడుకల్లో మాజీ ZP చైర్మన్ దావ వసంత సహా పలువురు BRS ముఖ్య నేతలతో కలిసి ఆయన ఒకే వేదికపై కనిపించారు. కొంతకాలంగా కాంగ్రెస్ అధిష్ఠానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన.. నేడు ప్రత్యర్థి పార్టీ నేతలతో ఆత్మీయంగా గడపడం ‘కారు’ ఎక్కబోతున్నారనే సంకేతాలను స్పష్టం చేస్తోంది.


