News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 26, 2026
కోరుట్ల: GREAT.. చనిపోతూ ఇద్దరి జీవితాల్లో వెలుగులు

జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నల్లాల లక్ష్మీరాజం ఆకస్మిక మరణం పోలీస్ శాఖను విషాదంలో ముంచింది. విధి నిర్వహణలో సేవలందించిన ఆయన, మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఇద్దరికి ప్రాణదాతగా నిలిచారు. ఆయన భార్య రాధ చూపిన ధైర్యం సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఒక జీవితం ముగిసినా.. మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన ఈ సంఘటన మానవత్వానికి గొప్ప నిదర్శనం.
News March 26, 2026
డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్

డోర్నకల్-గద్వాల మధ్య 296 km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ మీదుగా సాగుతుంది. DPR తర్వాత దీనికి క్లియరెన్స్ లభిస్తుంది. అయితే జడ్చర్ల-నంద్యాల లైన్‌లో ట్రాఫిక్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో భూసేకరణ జాప్యం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నా ఇప్పటివరకు 67% ల్యాండ్ సేకరించారు.
News March 26, 2026
బాపట్ల జిల్లాలో ఎన్ని గ్యాస్ సిలిండర్లు నిల్వ ఉన్నాయంటే..!

గృహ వినియోగానికి 3,389 గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని బాపట్ల జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి జమీర్ బాషా తెలిపారు. సింగిల్ సిలిండర్ ఉన్నవారు 25 రోజుల తర్వాత, డబుల్ సిలిండర్స్ ఉన్నవారు 35 రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలన్నారు. గ్యాస్ సంబంధిత వివరాలు తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ నంబర్ 94932 47765ను సంప్రదించాలని బుధవారం వెల్లడించారు.


