News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో రేపు పీజీఆర్ఎస్

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 22, 2026
పల్నాడు: పిడుగుపాటుకు గురై పాడి రైతు మృతి!

పల్నాడు (D) అమరావతి(M) ఎండ్రాయిలో పిడుగుపాటుకు ఓ పాడి రైతు బలయ్యాడు. గ్రామానికి చెందిన విజయ్ కుమార్ శనివారం సాయంత్రం గేదెలను మేపేందుకు పొలానికి వెళ్లగా, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రాత్రి అయినా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా.. గట్టుపై పిడుగు పడి విజయ్ మృతి చెంది ఉండటం గమనించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 22, 2026
ఒంటిమిట్టలో ఆక్రమణలు తొలగిస్తారా..?

ఒంటిమిట్ట కోదండరామాలయంలోని పంచాయతీ స్థలాలు ఆక్రమణలు పరిపాటిగా మారాయి. ప్రజలు, భక్తులు నడిచే కాలినడక బాటను సైతం దుకాణాల పేరుతో వదిలారన్నారు. మండల అధికార యంత్రానికి విషయం తెలిసినా రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అక్రమణలపై చేయి కుడా వేయలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లను జయించి అధికార యంత్రాగం ఆక్రమణలు తొలగిస్తుందా.. లేక ఎప్పటిలాగే కళ్లుమూసుకుంటుందా వేచి చూడాలని విశ్లేషకులు అంటున్నారు.


