News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 19, 2026
భావన్నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన SP

బాపట్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ క్షీర భావనారాయణ స్వామివారి ఆలయాన్ని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సందర్శించారు. గురువారం ఉగాది పండగ పురస్కరించుకుని ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన తెలుగు సంవత్సర సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని ఎస్పీ తెలిపారు.
News March 19, 2026
మే 20న ‘ఊసరవెల్లి’ రీరిలీజ్

సురేందర్ రెడ్డి-జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఊసరవెల్లి’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో బర్త్ డే సందర్భంగా మే 20న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఎన్టీఆర్ స్టైలిష్ యాక్షన్, సాంగ్స్, విభిన్నమైన కథాంశం కారణంగా ఫ్యాన్ ఫేవరెట్‌గా నిలిచింది. ఈ మూవీలో తమన్నా హీరోయిన్‌గా నటించారు.
News March 19, 2026
కర్నూలు: ప్రేమ వివాహానికి ప్రతీక ‘పిడకల సమరం’

కర్నూ(D) ఆస్పరి మండలం కైరప్పలలో ఉగాది పండుగ సందర్భంగా వీరభద్ర ఆలయానికి ఓ ప్రత్యేక కథ ఉంది. భద్రకాళి, వీరభద్రుడి ప్రేమ వివాహం వివాదంగా మారిందని, పండుగ మరుసటి రోజు ఇక్కడి భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి పేడతో చేసిన పిడకలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ సంప్రదాయ భక్తిని కొనసాగిస్తారని పురాణాల్లో ఉంది. ఈ పిడకల సమరాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్థులు భారీగా తరలి వస్తారు.


