News March 29, 2024

BREAKING: BRSకు ఎంపీ రాజీనామా

image

TG: రాజ్యసభ ఎంపీ, సీనియర్ నేత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడారు. ఈ మేరకు ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. బాధతోనే బీఆర్ఎస్‌ను వీడుతున్నానని, తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ మార్పుపై సీఎం రేవంత్‌ రెడ్డితో చర్చించినట్లు వెల్లడించారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేపు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.

Similar News

News January 31, 2026

టాస్ గెలిచిన భారత్

image

NZతో తిరువనంతపురంలో జరిగే చివరి టీ20లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 5 టీ20ల సిరీస్‌ను భారత్ ఇప్పటికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది. విధ్వంసకర బ్యాటర్ ఇషాన్ కిషన్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు.
భారత్: శాంసన్, అభిషేక్, ఇషాన్ కిషన్, సూర్య(C), రింకూ, హార్దిక్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

News January 31, 2026

గంగా నది ఎలా పుట్టిందో తెలుసా?

image

గంగానది పుట్టుక వెనుక భగీరథుని తపస్సు కారణం. సగరుని కుమారుల ఆత్మలకు మోక్షం ప్రసాదించేందుకు భగీరథుడు స్వర్గలోక వాసిని అయిన గంగను భూమికి రప్పించాడు. అయితే గంగా ప్రవాహ వేగాన్ని తట్టుకోవడానికి శివుడు ఆమెను తన జటాజూటంలో బంధించి, నేలకు మెల్లగా విడుదల చేశాడు. ఇలా భౌతిక ప్రపంచానికి వచ్చిన గంగ, పితృదేవతలను ఉద్ధరించి పవిత్ర నదిగా వెలుగొందుతోంది. అందుకే ప్రతి భారతీయుడు ఒక్కసారైనా గంగా నదిలో స్నానమాచరించాలి.

News January 31, 2026

బడ్జెట్ 2026: వెండికి డిమాండ్ పెరుగుతుందా? తగ్గుతుందా?

image

యూనియన్ బడ్జెట్ 2026పై ఇన్వెస్టర్లు కన్నేసి ఉంచారు. ముఖ్యంగా సిల్వర్‌పై ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే దేశీయంగా ధరలు తగ్గి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, దిగుమతులను తగ్గించడం కోసం డ్యూటీ పెంచే అవకాశాలూ ఉన్నాయి. అటు సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వాడకం ఎక్కువ కాబట్టి ప్రభుత్వం ఇచ్చే గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలు పారిశ్రామికంగా వెండికి మంచి బూస్ట్ ఇస్తాయి.