News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 18, 2026
తిరుపతిలో ఈ బిల్డింగ్‌ను గమనించారా..?

తిరుపతి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ TTD గోవిందరాజస్వామి సత్రాలు కూల్చి భారీ బిల్డింగ్స్ నిర్మిస్తున్నారు. రూ.600 కోట్లతో 8అంతస్తులతో అచ్యుతం, శ్రీ పథం అనే రెండు వసతి సముదాయాలు కడుతున్నారు. వీటిలో 1,000కి పైగా గదులు, డార్మెంటరీలు అందుబాటులోకి రానున్నాయి. దాదాపు 10వేల మంది భక్తులకు వసతి కల్పించనున్నారు. రెండేళ్ల ముందు పాత భవనాలు ఉండగా.. ఇప్పుడు అక్కడి భారీ భవంతులను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
News March 18, 2026
బాపట్లలో అభివృద్ధి ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ డా.వినోద్ కుమార్ ఆదేశించారు. బాపట్ల కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. నిజాంపట్నం, వేటపాలెం, అమృతలూరు, పర్చూరు, బాపట్ల మండలాల్లో పార్కులు ఏర్పాటు చేయాలన్నారు. భూముల కేటాయింపు, ఒప్పందాలు త్వరగా పూర్తి చేయాలన్నారు. సూర్యలంక అభివృద్ధికి అటవీ చట్టాల ప్రకారం అనుమతులు పొందాలని సూచించారు.
News March 18, 2026
‘భూ భారతి’లో 4వేల దరఖాస్తులు రామచంద్రాపురానివే..!

రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూ భారతి’పోర్టల్‌కు జిల్లాలో వచ్చిన మొత్తం దరఖాస్తుల్లో 4వేల అప్లికేషన్లు రామచంద్రాపురానివే. మంత్రి సీతక్క చొరవతో కలెక్టర్ దివాకర 10,500 ఎకరాలకు శాశ్వతంగా హద్దులు నిర్ణయించి పట్టాలు ఇచ్చేందుకు రీ సర్వేకు పూనుకున్నారు. గతంలో 1974-75, 1982, 1992, 2008లో కూడా సర్వేలు జరిగినా సత్ఫలితం రాలేదు. ఇప్పుడైనా పరిష్కారం వస్తుందని రైతులు భావిస్తున్నారు.


