News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
‘అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తా’

అవకాశం దొరికితే మళ్లీ మళ్లీ ఇందూరు తిరుమలకు వస్తానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం ఆమె మోపాల్ మండలం నర్సింగ్ పల్లిలోని ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మాట్లాడారు. ఆలయం నేపథ్యం తెలుసుకొని తాను సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యానన్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మేయర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.
News March 13, 2026
NZB: కృత్రిమ కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

ఎవరైనా కృత్రిమ కొరతను సృష్టించి బ్లాక్ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్లను విక్రయిస్తే నిత్యావసర సరకుల చట్టం-1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని NZB కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, 33 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సరఫరా జరుగుతోందని, శుక్రవారం నాటికి 10,850 సిలిండర్లు జిల్లాలో గృహావసరాల కోసం పంపిణీ నిమిత్తం అందుబాటులో ఉన్నాయన్నారు.