News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 21, 2026
సంగారెడ్డి: పాలిసెట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తులు ప్రారంభమైనట్లు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ జానకి దేవి తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఏప్రిల్ 20 వరకు https://polycet.sbtet.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News March 21, 2026
సిద్దిపేటలో సీఎం పర్యటన-జిల్లా నుంచి ఉచిత బస్సలు

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా నుంచి రైతులు పాల్గొనేందుకు ఉచిత బస్సు రవాణా సదుపాయం కల్పించనున్నట్లు జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఐడీఓసీ జగిత్యాల, ముత్యంపేట రైతు వేదిక, ధర్మపురి వ్యవసాయ కార్యాలయం నుంచి బస్సులు ఉదయం 8 గంటలకు బయలుదేరుతాయని, రైతులకు ఉచిత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశామన్నారు.
News March 21, 2026
VZM: ‘క్రమశిక్షణ, సేవాభావంతో ఉన్నత శిఖరాలు సాధ్యం’

మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్‌సీసీ విద్యార్థులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.


