News March 29, 2024
NZB: కుక్క కాటుతో వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుక్కకాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. నందిపేట లక్కంపల్లి సెజ్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మహేశ్(36)ను ఈ నెల 10న విధుల్లో ఉన్న సమయంలో కుక్క కరిచింది. నందిపేట PHCలో టీకాలు ఇప్పించుకున్నాడు. అనంతరం తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స నిమిత్తం ఇవాళ మృతి చెందాడు.
Similar News
News April 22, 2025
NZB: దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా వ్యాప్తంగా పాఠశాల విద్యా శాఖ పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మండల, జిల్లా స్థాయిలలో శిక్షణ ఇవ్వడానికి సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్ల (MRP, DRP)లను నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ అశోక్ తెలిపారు. జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన దరఖాస్తుల ద్వారా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ నియామకం చేపడుతుందన్నారు.
News April 22, 2025
ధర్పల్లి: వడదెబ్బతో రైతు మృతి

ధర్పల్లి మండలం వాడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం వడదెబ్బతో కరక రాములు(65) అనే రైతు మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఇటీవల తన పొలంలో యంత్ర సాయంతో పంట కోయించారు. యంత్రం వెళ్లలేని ప్రాంతంలో మిగిలిపోయిన పంటను ఉదయం నుంచి కోస్తూ వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.
News April 22, 2025
NZB: డిగ్రీ పరీక్షలు వాయిదా

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 28వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ రెగ్యులర్ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్, బ్యాక్ లాగ్ ఒకటి, మూడు, ఐదో సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. పూర్తి వివరాలు తెలంగాణ వర్సిటీ వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు కంట్రోలర్ వివరించారు.