News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 6, 2026

ట్రంప్‌పై విమర్శలతో విరుచుకుపడిన దుబాయ్ బిలియనీర్

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తల నేపథ్యంలో UAE బిలియనీర్ ఖలాఫ్ అహ్మద్ అల్ హబ్తూర్ ట్రంప్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తమ ప్రాంతాన్ని యుద్ధంలోకి లాగడానికి మీకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ‘బోర్డ్ ఆఫ్ పీస్’కు గల్ఫ్ దేశాలు భారీగా నిధులిచ్చాయని.. ఆ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. యుద్ధాలు ఉండవంటూనే ఇరాన్ సహా ఏడు దేశాలపై ఆపరేషన్స్ చేశారని మండిపడ్డారు. కాగా ఖలాఫ్ అహ్మద్ UAEలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి.

News March 6, 2026

ఉట్నూర్: ATCలో షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ప్రభుత్వ ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ మ్యాన్ ట్రైనింగ్ స్కీమ్‌లో భాగంగా నిర్వహించే అఖిల భారత వాణిజ్య పరీక్ష షార్ట్ టైం కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉట్నూర్ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. వివిధ కేటగిరీల వారీగా కోర్సులు నిర్వహిస్తున్నామన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా సందేహాలు ఉంటే కళాశాలకు నేరుగా వచ్చి సంప్రదించాలన్నారు.

News March 6, 2026

సంగారెడ్డి: ఇంటి వద్దకే సీతారాముల ముత్యాల తలంబ్రాలు

image

శ్రీరామనవమి సందర్భంగా భక్తుల చెంతకే స్వామివారి ముత్యాల తలంబ్రాలను చేరవేసే కార్యక్రమాన్ని ఆర్టీసీ ప్రారంభించింది. సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ గురువారం దీనికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆసక్తి గల భక్తులు 151 రూపాయలు చెల్లించి ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు. నేరుగా ఇంటికే తలంబ్రాలు అందేలా ఈ వినూత్న సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు.