News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
ఉండవెల్లి: తల్లి కళ్లముందే తనువు చాలించిన కుమారుడు

తల్లి కళ్ళముందే తనయుడు తనువు చాలించిన విషాదకరమైన ఘటన ఉండవెల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఉండవెల్లికి చెందిన మజ్హర్, తన తల్లి సత్తాజ్ బేగంతో కలిసి బైక్ పై కర్నూల్‌లో కంప్యూటర్ కోచింగ్‌కి బయలుదేరాడు. సరిగ్గా 44వ జాతీయ రహదారిపై ఉత్తర ఫ్రూట్స్ సమీపంలో బైకు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని స్థానికులు తెలిపారు.
News March 16, 2026
పెద్దపల్లి: హెచ్‌టీ సర్వీసులకు సింగిల్ విండో విధానం

హెచ్‌టీ 11 కేవీ, 33 కేవీపై వోల్టేజ్ విద్యుత్ సర్వీసుల మంజూరును వేగవంతం చేసేందుకు సింగిల్ విండో వ్యవస్థ ఉపయోగపడుతుందని PDPL సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గంగాధర్ తెలిపారు. ఇప్పటివరకు ఈ విధానం ద్వారా 542 సర్వీసులు మంజూరు చేసినట్లు చెప్పారు. దరఖాస్తులను TGNPDCL పోర్టల్‌లో నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించడంతో పారదర్శకత పెరిగిందన్నారు.
News March 16, 2026
అందరికీ ధన్యవాదాల: అనంత కలెక్టర్

గుత్తి పట్టణంలో తొలిసారిగా రెండు రోజులపాటు నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో కార్యక్రమాలు ఘనంగా జరిగాయని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. ఉత్సవాలను విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.


