News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 22, 2026
నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం: SP

నిందితులకు శిక్ష పడినప్పుడే బాధితులకు న్యాయం జరిగినట్లు అవుతుందని ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. శనివారం బాపట్ల పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన కోర్టు కానిస్టేబుల్స్‌తో సమీక్షించారు. కోర్ట్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. కోర్టు కానిస్టేబుల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కోర్టులు, పోలీస్ స్టేషన్లు మధ్య సమన్వయం పెంపొందించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.
News March 22, 2026
TODAY HEADLINES

☛ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు.. మోదీతో ఇరాన్ అధ్యక్షుడు
☛ హార్ముజ్‌ను తెరవండి.. ఇరాన్‌కు 22 దేశాల లేఖ
☛ ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్
☛ రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్
☛ తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు: CBN
☛ AP: ‘గురుకుల’ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు
☛ ఆగమశాస్త్రానుసారం ‘భద్రాచలం’ అభివృద్ధి: రేవంత్
☛ 6 గ్యారంటీలకు చట్టబద్ధతతో ఎన్నో లాభాలు: KTR
News March 22, 2026
ఐపీఎల్‌కు బారెడు.. టెస్టులకు చారెడు!

క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు BCCI ఏటా ఐపీఎల్ మ్యాచ్‌ల సంఖ్య పెంచుతోంది. ఈసారి పది మ్యాచ్‌లు పెంచి 84కి చేర్చింది. ఇది బాగానే ఉన్నా భారత్ లాంగ్ ఫార్మాట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఐపీఎల్ తర్వాత IND షెడ్యూల్‌లో 16 T20లు, 15 ODIలు ఉంటే టెస్టులు మాత్రం ఐదే ఉన్నాయి. అఫ్గాన్‌తో ఒకటి, శ్రీలంక- NZతో చెరో రెండు టెస్టులు IND ఆడనుంది. దీంతో బీసీసీఐ టెస్ట్‌లను విస్మరిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


