News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 24, 2026
BREAKING: జగ్గయ్యపేట కెమికల్ కర్మాగారంలో అగ్ని ప్రమాదం

జగ్గయ్యపేటలోని గౌరవరం పంచాయతీ పరిధిలో జేఆర్ ఏకో కెమికల్ కర్మాగారంలో గ్యాస్ సిలెండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ ప్లాంట్‌లో సిలిండర్ల పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. జగ్గయ్యపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 24, 2026
తొర్రూరు కేంద్రంగా కొత్త నియోజకవర్గం?

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పాలకుర్తి పరిధిలోని తొర్రూరు పురపాలక సంఘం, సమీప మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు కానుందనే చర్చ జోరుగా సాగుతోంది. తొర్రూరు కేంద్రంగా విభజన జరిగితే పాలన మరింత చేరువవడమే కాకుండా అభివృద్ధి పనులు వేగవంతం అవుతాయని స్థానికులు ఆశిస్తున్నారు. ఈ పరిణామం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
News March 24, 2026
KTR, రాజగోపాల్ రెడ్డి భేటీ.. దోస్తీయా? రాజకీయమా?

అసెంబ్లీ లాబీలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, MLA కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుమారు 2 గంటల పాటు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. వీరిద్దరూ కలిసి భోజనం చేస్తూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ MLA పాయల్ శంకర్ కూడా కొద్దిసేపు వీరితో ముచ్చటించారు. ఇటీవల పలు శుభకార్యాల్లోనూ రాజగోపాల్ రెడ్డి.. కేటీఆర్, హరీశ్ రావులను కలవడంతో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


