News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 29, 2026

పశ్చిమాసియా యుద్ధానికి నెల.. కీలక ఘటనలు

image

*FEB 28- సుప్రీం లీడర్ ఖమేనీ హతం. స్కూల్‌పై మిస్సైల్ పడటంతో చిన్నారులు సహా 170 మంది మృతి
*MAR 2- హార్ముజ్ జలసంధి మూసివేత. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా దాడులు
*MAR 8- కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఎన్నిక
*MAR 16- ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ హతం
*MAR 18- ఇరాన్ ఎనర్జీ ప్లాంట్లపై ఇజ్రాయెల్ దాడి
*MAR 21- హార్ముజ్ తెరవాలని ట్రంప్ అల్టిమేటం

News March 29, 2026

ఒంటిమిట్టకు CM.. షెడ్యూల్ ఇదే.!

image

బుధవారం జరగనున్న ఒంటిమిట్ట కోదండరామయ్య కళ్యాణానికి CM చంద్రబాబు రానున్నారు. బుధవారం సా.4:15 గం. ఒంటిమిట్టలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు.
▶ 4.30-6:05: TTD గెస్ట్ హౌస్‌లో రెస్ట్
▶ 6:15-6:30: స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
▶ 6:35: సీతారామయ్య కళ్యాణ వేదికకు చేరుకుంటారు
▶ 6:45-8:30: తలంబ్రాలు సమర్పించి కళ్యాణాన్ని తిలకిస్తారు
▶ 8:40: TTD గెస్ట్ హౌస్‌‌లో రాత్రికి అక్కడే బస చేస్తారు.

News March 29, 2026

తగ్గేదేలే.. హైదరాబాద్ NO.1

image

HYDలో రూ.10 వేల జీతం వచ్చినా, రూ.లక్ష జీతగాడైనా ఈజీగా బతికేయొచ్చని ‘ఈజ్ ఆఫ్ లివింగ్ సూచీ’తో తెలుస్తోంది. దేశంలోని 8 మెట్రో నగరాల్లో 15 కొలమానాలతో చేసిన సర్వేలో HYD అగ్రస్థానంలో నిలిచింది. విద్య, ఆరోగ్యం, భద్రత, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల్లో మెరుగైన ప్రదర్శనతో గుర్తింపు దక్కింది. గృహ వసతి, జీవన వైవిధ్యం HYD ర్యాంకింగ్‌ను పెంచాయి. తర్వాతి స్థానాల్లో బెంగళూరు, కోల్‌కతా నిలిచాయి.