News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 28, 2026
KNR: మిగిలింది మూడు రోజులే.. ‘దళపతి’ ఎక్కడ.?

కేంద్ర మంత్రి అమిత్ షా పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతుండటంతో జగిత్యాల(D) బీర్పూర్‌కు చెందిన ముప్పాల లక్ష్మణరావు @గణపతి లొంగుబాటుపై సస్పెన్స్ విడడం లేదు. నేపాల్ లో గణపతిని అదుపులోకి తీసుకున్నారని, HYDలో CM రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారనే వార్తలు సైతం వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కగార్ డెడ్లైన్ ఇంకా 3రోజులే మిగిలి ఉంది.
News March 28, 2026
NTR: ఫార్మ్-డీ విద్యార్థులకు ముఖ్య గమనిక

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని ఫార్మ్-డీ III/VI థియరీ పరీక్షలను ఏప్రిల్ 15 నుంచి నిర్వహిస్తామని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 1లోపు ఫైన్ లేకుండా, ఏప్రిల్ 2లోపు రూ. 100 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in/ చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
News March 28, 2026
ట్రంప్-మోదీ ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్

యుద్ధం నేపథ్యంలో ఇటీవల ట్రంప్, మోదీ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఈ కాల్‌లో మస్క్ పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ఇద్దరు దేశాధినేతల మధ్య జరిగే దౌత్యచర్చల్లో ఏ ప్రభుత్వ పదవిలో లేని ఒక ప్రైవేట్ వ్యక్తి పాల్గొనడం చాలా రేర్. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీకి కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ కంట్రోల్ గురించి చర్చిస్తున్న సమయంలో మస్క్ ఉండటం చర్చనీయాంశమైంది.


