News March 29, 2024

రూ.10,000 కోట్ల ఆదాకు అమెజాన్ కసరత్తు

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ బ్రాంచ్‌లలో ఆఫీస్ స్పేస్‌ను కుదించడం ద్వారా రూ.10,000 కోట్లు ఆదా చేయడానికి అమెజాన్ కసరత్తు చేస్తోంది. అవసరం లేని చోట ఆఫీసు లీజులను క్లోజ్ చేయడం, కొన్ని అంతస్తుల వినియోగాన్ని నిలిపివేయడంపై దృష్టిసారించింది. కార్యాలయాలను ఉద్యోగులు ఎలా వినియోగిస్తున్నారనే దానిపై విశ్లేషించి దశలవారీగా కుదింపు చేయనుంది. కాగా ఇప్పటికే కొన్ని వేల మంది ఉద్యోగులను సంస్థ తొలగించిన విషయం తెలిసిందే.

Similar News

News February 5, 2025

దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!

image

TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

News February 5, 2025

అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు

image

TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.

News February 5, 2025

రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ

image

TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!