News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 14, 2026

WGL: మొండి బకాయిదారులకు నోటీసులు

image

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో ఇంటి పన్ను మొండి బకాయిదారులకు ఆర్పీల ద్వారా నోటీసులు పంపిణీ చేయిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో గత రెండేళ్లుగా ఆస్తిపన్ను చెల్లించని 19 వేల మంది మొండి బకాయిదారులు ఉన్నారు. మెప్మా ఆర్పీల ద్వారా వారందరికీ కార్పొరేషన్ అధికారులు రెడ్ నోటీసులు అందించి సంతకాలు తీసుకుంటున్నారు. ఈ నెలాఖరుతో పన్ను చెల్లింపు గడువు ముగుస్తుండటంతో ఆర్పీల సేవలను తీసుకుంటున్నారు.

News March 14, 2026

గుంటూరులో బ్లింకిట్ పేరుతో సైబర్ మోసం

image

గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కృష్ణనగర్ నాలుగో లైన్‌కు చెందిన పగడాల ప్రసాద్‌ను సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. బ్లింకిట్ యాప్ ఆర్డర్ రిటర్న్ పేరుతో గూగుల్‌లో కనిపించిన నంబర్‌కు కాల్ చేయగా యూపీఐకు డబ్బు పంపితే రిఫండ్ వస్తుందని చెప్పి రూ.84 వేలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 14, 2026

పుకార్లు నమ్మొద్దు.. మోసపోవద్దు: నల్గొండ కలెక్టర్

image

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్గొండ కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ దొరకదనే పుకార్లను నమ్మి అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని 33 ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసిన 4 నుంచి 5 రోజుల్లోపు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీల వద్ద 8118 సిలిండర్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు.