News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 12, 2026
ఇవాళ ఎయిర్‌ఫోర్స్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. అర్హతలివే

గుంటూరులోని ANUలో ఇవాళ AP, ఈ నెల 15న TG అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయులో ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత యువకులు అర్హులు. ఇంటర్/రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ పాసై ఉండాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లు, 6 జిరాక్స్ కాపీలు, ఆధార్, 10 పాస్ పోర్టు కలర్ ఫొటోలు తీసుకువెళ్లాలి. 6AM-10AM లోపు ANUకు చేరుకోవాలి.
News March 12, 2026
అనకాపల్లి: కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO అప్పారావు నాయుడు బుధవారం తెలిపారు. 6, 11వ తరగతుల ప్రవేశాలతో పాటు 7, 8, 9, 10, 12వ తరగతుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈనెల 12 నుంచి ఏప్రిల్ 1 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. అనాథలు, బడి బయట ఉన్నవారు, డ్రాప్ అవుట్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, వలస కార్మికులు, తల్లిదండ్రులు ఒక్కరే ఉన్నవారు అర్హులుగా పేర్కొన్నారు.
News March 12, 2026
కామారెడ్డి: భగవద్గీత ముద్రణతో పెళ్లి ఆహ్వాన పత్రిక

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా వివాహ ఆహ్వాన పత్రికల రూపకల్పనలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా “భగవద్గీత” రూపంలో పెళ్లి పత్రికలను ముద్రించడం ఒక సరికొత్త ఆధ్యాత్మిక ఒరవడికి శ్రీకారం చుట్టారు. కామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి తన కుమారుని వివాహానికి ధర్మ ప్రచారం జరగాలని, భగవద్గీత జ్ఞాన ప్రధాన విశిష్టత తెలిసేలా ఆహ్వాన పత్రికను రూపొందించారు. మీకు అలాంటి పత్రికలు వచ్చాయా!


