News March 29, 2024
ఓటు వేయకపోతే రూ.350 ఫైన్.. నిజమేనా?
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓ మెసేజ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని ఓటర్లకు ఎన్నికల సంఘం ఫైన్ వేస్తుంది. వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350లను డెబిట్ చేస్తుంది’ అని మెసేజ్ సారాంశం. దీనిపై కేంద్రానికి సంబంధించిన PIB FACTCHECK స్పందించింది. ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను నమ్మొద్దని పేర్కొంది.
Similar News
News November 6, 2024
గ్రూప్-4 అభ్యర్థుల ‘పోస్ట్ కార్డు’ నిరసన
TG: గ్రూప్-4 పరీక్ష తుది ఫలితాల కోసం అభ్యర్థులు వినూత్న నిరసనకు దిగారు. పరీక్ష జరిగి దాదాపు 500 రోజులు కావస్తున్నా నియామకాలు జరగకపోవడంతో TGPSCకి భారీ సంఖ్యలో పోస్ట్ కార్డుల ద్వారా వినతిపత్రాలు పంపించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెలక్షన్ లిస్ట్ విడుదల చేసి 8 వేల మంది అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు.
News November 6, 2024
ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన కాసేపటికే డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా దేశం నుంచి అక్రమ వలసదారులను పంపించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆయన అధికార ప్రచార ప్రతినిధి కరోలిన్ వెల్లడించారు. తక్షణమే ఈ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు ఆమె చెప్పారు. కాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల మందిని వెనక్కి పంపుతామని ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
News November 6, 2024
అమిత్ షాతో ముగిసిన పవన్ సమావేశం
AP: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం ముగిసింది. దాదాపు 15 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి విగ్రహాన్ని పవన్ బహుకరించారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో ఆయన ఏపీకి తిరిగి పయనమవుతారు.