News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 18, 2026

ఓరుగల్లులో బాంబు కలకలం.. కోర్టులో ముమ్మర తనిఖీలు

image

వరంగల్ నగరంలో మధ్యాహ్నం 2 గంటలకు 5 చోట్ల బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ వచ్చిన ఒక అజ్ఞాత ఈ-మెయిల్ పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించింది. ముఖ్యంగా వరంగల్ కోర్టు పరిసరాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్స్‌తో జల్లెడ పట్టారు. గతంలోనూ ఇలాంటి ఫేక్ బెదిరింపులు రావడంతో పోలీసులు కీలక ప్రాంతాలను తనిఖీ చేశారు. చివరకు ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

News March 18, 2026

ఇండక్షన్ స్టవ్ వాడుతున్నారా?

image

గ్యాస్ కొరత నేపథ్యంలో ఇటీవల ఇండక్షన్ స్టవ్‌ల వినియోగం పెరిగింది. అయితే ఈ స్టవ్‌లను ఉపయోగించిన వెంటనే ఆఫ్ చేయొద్దని పలు కంపెనీలు సూచిస్తున్నాయి. వంట పూర్తయ్యాక కొంత సేపు స్టాండ్ బై మోడ్‌లో ఉంచాలంటున్నాయి. ఇలా చేస్తే స్టవ్‌లో ఉన్న కూలింగ్ ఫ్యాన్ లోపలి భాగాల వేడిని తగ్గిస్తుందని చెబుతున్నాయి. వెంటనే ఆఫ్ చేస్తే స్టవ్‌లోని సున్నితమైన భాగాలు ఎక్కువసేపు వేడిగా ఉండి పనితీరు తగ్గుతుందంటున్నాయి.

News March 18, 2026

వైభవంగా రామయ్య నిత్య కళ్యాణ వేడుక

image

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బుధవారం నిత్య కళ్యాణ వేడుక కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, కంకణధారణ గావించి సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి తరించారు.