News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 6, 2026
ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు!

TG: రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో <<19171673>>ఫీజులు పెరిగాయి<<>>. ప్రస్తుత, వచ్చే విద్యా సంవత్సరాలకు సంబంధించి 160 కాలేజీల ఫీజును ప్రభుత్వం ఖరారు చేసింది. TAFRC సిఫార్సుల మేరకు అత్యల్పంగా ₹45 వేలు, అత్యధికంగా ₹1.83 లక్షలుగా నిర్ణయించింది. CBIT(₹1.83 లక్షలు), వాసవి(₹1.75 లక్షలు), MGIT(1.67 లక్షలు), CVR(₹1.63 లక్షలు)లో ఫీజులు ఎక్కువగా ఉన్నాయి. 35కు పైగా కాలేజీల్లో ₹లక్షకు పైనే ఉండటం గమనార్హం.
News March 6, 2026
రష్యా క్రూడాయిల్ వచ్చేస్తోంది!

అమెరికా <<19308509>>ఆంక్షల సడలింపు<<>>తో రష్యా నుంచి భారీగా ముడి చమురు ఇండియాకు రానుంది. 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు భారత తీరానికి దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవి వారంలో మన పోర్టులకు చేరుకోవచ్చని బ్లూమ్‌బర్గ్ డేటా చెప్పింది. సింగపూర్ వద్ద ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలోనే వస్తాయని వివరించింది. US నుంచి సిగ్నల్ రాకముందే రష్యా ట్యాంకర్లు ఇండియా వైపు మళ్లాయని తెలుస్తోంది.
News March 6, 2026
తిరుపతి: రేపే మహిళా యూనివర్సిటీ కాన్వకేషన్

తిరుపతి శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో శనివారం 22వ కాన్వకేషన్ నిర్వహిస్తున్నట్లు వీసీ ఉమ వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. మొత్తం 1,601 మందికి డిగ్రీ పట్టాలు అందజేస్తామని తెలిపారు.


