News March 29, 2024
నెల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో మారిన రాజకీయాలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే BRS కీలక నేతలు పార్టీ వీడటంతో KCRకి ఊహించని షాకులు తగులుతున్నాయి. మాజీ MLA ఆరూరి రమేష్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌లు BJPలో చేరగా.. వరంగల్ ఎంపీ దయాకర్, DCCB ఛైర్మన్ మార్నెని రవీందర్, పలువురు MPPలు కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు MLA కడియం, ఆయన కుమార్తె కావ్యలు సైతం పార్టీని వీడుతుండటంతో BRSకు కోలుకోని దెబ్బ తగిలింది.
Similar News
News March 20, 2026
బడ్జెట్‌లో వరంగల్‌కు అన్యాయం.. మంత్రి స్పందించాలి: బీజేపీ

బడ్జెట్లో వరంగల్ జిల్లాకు అన్యాయం చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్‌పై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎం, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్‌కు ఒక రూపాయి కూడా కేటాయించలేదన్నారు. ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పార్క్, హైవే రోడ్ల మాటలేదని, గ్రేటర్ వరంగల్‌కు మరో సారి మొండిచెయ్యి చూపారని, దీనిపై జిల్లా మంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు.
News March 18, 2026
వరంగల్: రెండవ రోజు 99.9 శాతం విద్యార్థులు హాజరు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రెండవరోజు వరంగల్ జిల్లాలో మొత్తం 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9,482 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 9,473 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజయ్యారు. మొత్తంగా హిందీ పరీక్షకు 99.91 శాతం విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంగతులు జరగలేదని డీఈవో రంగయ్య తెలిపారు.
News March 16, 2026
స్త్రీనిధి రుణాలు పక్కదారి.. రూ.1.50 కోట్లు గోల్‌మాల్

వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో స్త్రీనిధి రుణాలు దారి తప్పాయి. మహిళా సంఘాల సభ్యుల నుంచి కిస్తీలు వసూలు చేసిన 50 మంది రిసోర్స్ పర్సన్లు (ఆర్‌పీలు), ఆ సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా సుమారు రూ.1.50 కోట్లు సొంతానికి వాడుకున్నారు. అధికారుల నోటీసులతో అసలు విషయం బయటపడటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. బాధ్యులైన ఆర్‌పీలకు అధికారులు మెమోలు జారీ చేశారు.


