News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 7, 2026
VIRAL: సిస్టర్‌తో సీఎం నితీశ్

ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా? దేశ రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్న బిహార్ సీఎం నితీశ్ సోదరి సామాన్య జీవనం గడపడం విశేషమే. కుర్చీలో కూర్చుంటే కోట్లు కూడబెట్టే కాలమిది. కానీ 20 ఏళ్లుగా సీఎంగా ఉన్నా.. ఆయన కూడా ఆస్తులు వెనకేసుకోలేదు. నితీశ్ ఆస్తులు రూ.1.66 కోట్లే. హోలీ రోజు తన అక్క ఉషా దేవిని ఆయన కలిసిన ఫొటో వైరలవుతోంది. పీఎం మోదీ, యూపీ సీఎం యోగి కుటుంబీకులు సైతం ఇలాగే నిరాడంబరంగా ఉండటం విశేషం.
News March 7, 2026
ఎన్టీఆర్: బీఈడీ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ANU) పరిధిలోని కాలేజీలలో బీఈడీ విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి నిర్వహిస్తామని.. విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 1వ తేదీ లోపు, రూ.100 ఫైన్‌తో 2వ తేదీ లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ చూడాలంది.
News March 7, 2026
KNR: సన్న బియ్యం ముచ్చటగా మూడు నెలల కోటా..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పేదలకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఆహార భద్రత కార్డు కలిగిన లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటా బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. గతేడాది మాదిరిగానే ఈ నెలాఖరులోపు గోదాముల నుంచి రేషన్ దుకాణాలకు 3 నెలకు సంబంధించిన సన్న బియ్యం నిల్వలను తరలించేందుకు సిద్ధమవుతున్నారు.


