News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 31, 2026
సిద్దిపేట: బెంగుళూరులో ఆత్మహత్య చేసుకున్నది వీరే

బెంగుళూరులో సహజీవనం చేస్తున్న బాబు రెడ్డి, యువతి <<19524633>>ఆత్మహత్య<<>> చేసుకున్నారు. ఇద్దరూ ఒకరి వెంట ఒకరు సూసైడ్ చేసుకోవడంతో విషాదం నెలకొంది. వారు సహజీవనం చేస్తున్న విషయం ఇంట్లో వారికి తెలియదని పోలీసులు చెప్పారు. బాబు రెడ్డి వద్ద సూసైడ్ నోట్ లభించిందని, మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో రాసినట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
News March 31, 2026
పోలీసుల సేవలు అనన్యం: సీపీ

సమాజ శ్రేయస్సు కోసం కుటుంబాలను వదిలి నిరంతరం శ్రమించే పోలీసులు అభినందనీయులని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా కొనియాడారు. మంగళవారం పదవీ విరమణ చేసిన ఎస్సై అంజయ్య, ఏఎస్‌ఐలు వెంకటస్వామి, రాయిస్ అహ్మద్‌లను ఆయన ఘనంగా సత్కరించారు. విధి నిర్వహణలో వారు చూపిన అంకితభావం స్ఫూర్తిదాయకమన్నారు. జ్ఞాపికలు అందజేసి, శేష జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు.
News March 31, 2026
విశాఖలో కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై కేసులు

విశాఖలో 10 రోజులుగా రవాణా శాఖ అధికారులు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై 16 కేసులు నమోదు చేసినట్టు ఉప రవాణా కమిషనర్ ఆర్‌సీహెచ్.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతులు లేకుండా నడపడం, పర్మిట్ నిబంధనలు ఉల్లంఘించడం, పన్నులు చెల్లించకపోవడం వంటివి డ్రైవ్‌లో గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 16 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.6,94,000 ఫైన్ విధించారు.


