News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 14, 2026
అక్రమంగా గ్యాస్ నిల్వ చేస్తే కఠిన చర్యలు: ADB కలెక్టర్

ఆసుపత్రులు, వసతి గృహాలు, అనాధ శరణాలయాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులకు సూచించారు. గృహ అవసరాలకు కేటాయించిన డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లించినా, అక్రమంగా నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టేందుకు పౌర సరఫరాల అధికారులు, డిటిలు, ఎస్ఐలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 14, 2026
భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్

జిల్లాలో రెవెన్యూ భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. ప్రతీ సోమవారం రెవెన్యూ క్లినిక్‌లు నిర్వహించి మ్యుటేషన్లు, అసైన్‌మెంట్, డాటెడ్ ల్యాండ్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ చివరి వారం నుంచి ఇప్పటివరకు వచ్చిన 1,523 దరఖాస్తుల్లో 724 పరిష్కరించగా, మిగిలినవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
News March 14, 2026
సోదరిని 84 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు!

తనతో పాటు పుట్టిన సోదరిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపిన ఘటన UPలో జరిగింది. కవల సోదరి హిమాన్షిక(25)తో పాటు హార్దిక్ ఏడాదిన్నర కిందటి వరకు ఇంజినీర్‌గా పనిచేసేవాడు. జాబ్ మానేశాక SMలో ఎక్కువ టైమ్ గడపడం, ఓ అమ్మాయిని లవ్ చేస్తున్న విషయంలో సోదరుడిని హిమాన్షిక మందలించింది. కక్ష పెంచుకున్న అతను సోదరిపై 84సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఆపై సర్‌ప్రైజ్ అంటూ తల్లికి డెడ్‌బాడీ చూపించి ఆమెపైనా దాడి చేశాడు.


