News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 8, 2026
నరసరావుపేట: భారీగా తగ్గిన కోడిగుడ్ల ధరలు.. తగ్గనంటున్న చికెన్!

నరసరావుపేటలో ఆదివారం నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. లైవ్ కోడి కేజీ రూ.150గా ఉంది. స్కిన్ రూ.240-260, స్కిన్ లెస్ రూ.250-270లుగా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.900-1,000 రేటు పలుకుతోంది. ఇటు కోడిగుడ్ల ధరలు బాగా తగ్గాయి. 100 కోడిగుడ్లు రూ.425గా వ్యాపారులు అమ్ముతున్నారు. ఈ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News March 8, 2026
కామారెడ్డి జిల్లాలో చికెన్ మటన్ ధరల వివరాలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం చికెన్, మటన్ ధరల వివరాలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ.800, బోటీ రూ.400, చికెన్ స్కిన్ లెస్ రూ.280-రూ.300, లైవ్ కోడి కిలో రూ.180 చొప్పున విక్రయిస్తున్నారు.
News March 8, 2026
హనుమకొండ: వైకల్యం ఆమెకి అడ్డు కాలేదు

హనుమకొండకు చెందిన డాక్టర్ రమాదేవి వైకల్యాన్ని అడ్డుగా భావించలేదు. మనోనిగ్రతతో ఉన్నత చదువులు పూర్తి చేశారు. ఆమె కేయూలో పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. పారా త్రో బాల్ క్రీడలో అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి స్వర్ణ పథకం సాధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ రమాదేవిని హనుమకొండలో అభినందించారు.


