News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 26, 2026
మదనపూర్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత

వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా… అత్యధికంగా మదనాపూర్‌లో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దమందడి 38, ఏదుల 37.9, వనపర్తి, శ్రీరంగాపూర్, దీపనగండ్ల, వెలుగొండ 37.7, కానాయపల్లి, ఆత్మకూరులో 37.6, దగడ 37.2, విలియంకొండ, సోలిపూర్, జానంపేట 37.0, పాన్గల్ 36.7, ఘన్పూర్ 36.6, రేవల్లి 36.4, పెబ్బేరు 36.3, డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 26, 2026
నేటి నుంచి భానుడి భగభగలు

TG: నేటి నుంచి భానుడు భగ్గుమంటాడని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో 39-41 డిగ్రీలు, హైదరాబాద్‌లో 38-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతలతో వికారాబాద్, సంగారెడ్డి, RR, నారాయణపేట్, ADB, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.
News March 26, 2026
విశాఖలో యాక్సిడెంట్‌లకు ప్రధాన కారణాలివే..

విశాఖ జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు పెరగడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అతివేగం, అనుభవం లేని డ్రైవర్లు, నిర్లక్ష్య డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. రహదారులపై ఆక్రమణలు, అనధికార పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ లోపం పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయి. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, నిబంధనల అమలులో అలసత్వం, వాహనాల లోపాలు కూడా ప్రమాదాల పెరుగుదలకు కారణమవుతున్నాయి.


