News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 16, 2026
నరసరావుపేట: ‘నగదు రహిత వైద్యం అందించాలి’

కలెక్టర్ కృత్తికా శుక్లా అధ్యక్షతన కలెక్టరేట్‌లో డా. ఎన్టీఆర్ వైద్య సేవలపై డిస్ట్రిక్ట్ డిసిప్లినరీ కమిటీ సమావేశం నిర్వహించారు. మొత్తం 29 ఫిర్యాదులను డా. జి. చంద్రశేఖర్ వివరించారు. డా. ఎన్టీఆర్ వైద్య సేవల పరిధిలో వచ్చే రోగులకు పూర్తిగా నగదు రహిత వైద్యం అందించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పేషెంట్ల వద్ద నుంచి బిల్లులు వసూలు చేయకుండా యాజమాన్యాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
News March 16, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రచారం.. పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి కూతురు

కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ కూతురు హిమాయని ఢిల్లీ హైకోర్టులో ₹10Crకు పరువు నష్టం దావా వేశారు. US లైంగిక నేరస్థుడు ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో తనకు సంబంధం ఉన్నట్లు కొందరు SMలో తప్పుడు ప్రచారం చేశారని ఆమె పేర్కొన్నారు. ఆ కంటెంట్‌ను తొలగించాలని కోరారు. కాగా ఎప్‌స్టీన్‌తో హర్దీప్ పూరీకి సంబంధాలున్నట్లు 2014-15 మధ్య విమర్శలు రాగా ఆయన ఖండించారు.
News March 16, 2026
విశాఖ: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్‌లకు 397 వినతులు

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలకు గడువులోగా పరిష్కారం చూపకపోతే చర్యలు తప్పవని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై సాధారణ పీజీఆర్ఎస్‌కు 397 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ క్లినిక్‌కు 119, జీవీఎంసీకి చెందినవి 94, పోలీసు 26, ఇతర శాఖలకు సంబంధించినవి 158 వినతులు ఉన్నాయి.


