News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News April 6, 2026
మహాలక్ష్మి పథకం.. ఓరుగల్లులో 22 కోట్ల టికెట్లు జారీ

టీజీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోల ద్వారా ఇప్పటివరకు 22 కోట్లకు పైగా మహిళలకు ఉచిత టికెట్లు జారీ చేశారు. హనుమకొండ 4.47, తొర్రూర్ 2.00, వరంగల్-2 డిపో 1.90, పరకాల 2.10, జనగామ 3.24, మహబూబాబాద్ 1.97, నర్సంపేట 2.49, వరంగల్ 1 డిపో 1.93, భూపాలపల్లి 1.98 కోట్ల మహిళలు ప్రయాణించారని, 100% ఆక్యుపెన్సీ రేషియో అధిగమించామని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
News April 6, 2026
ట్రంప్‌ను పదవి నుంచి తొలగిస్తారా?

ట్రంప్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఓ చట్టసభ్యుడు కూడా అందుకు ప్రతిపాదించారని సమాచారం. కాల్షీ వంటి బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఆయన తొలగింపుపై పందెం వేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఇరాన్‌తో యుద్ధం, కీలక నిర్ణయాల్లో ఆయన వ్యవహారశైలే అందుకు కారణం. ట్రంప్‌ను 25వ అమెండ్‌మెంట్ ఆధారంగా తొలగిస్తారా అనే ప్రశ్నకు ‘Yes’ అన్నవారి సంఖ్య గతనెలలో 28.6% ఉండగా ఇప్పుడది 35.1%కి చేరింది.
News April 6, 2026
కామారెడ్డి: ఈ అతిథి గృహానికి 114 ఏళ్లు

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన అతిథి గృహానికి 114 ఏళ్లు పూర్తయ్యాయి. 1912లో అతిథి గృహాన్ని రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఎంతోమందికి సేద తీరుస్తోంది. ఎంతో మంది ముఖ్యమంత్రి, గవర్నర్లు, మంత్రులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఇతర నాయకులకు అతిథిగృహం ఎంతగానో ఉపయోగపడుతోంది.


