News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News April 13, 2026

యాదాద్రి: బెల్టు షాపు పెడితే రూ.10 వేలు ఫైన్

image

బద్దు తండా గ్రామసభలో సర్పంచ్ కవిత శ్రీనివాస్ అధ్యక్షతన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామంలో బెల్టు షాపులు నడిపితే రూ.10,000 జరిమానా విధిస్తామని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తీర్మానించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గ్రామ భద్రత దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయాలపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమములో ఉపసర్పంచ్, ప్రజలు పాల్గొన్నారు.

News April 13, 2026

వేతనం కోసం 16వేలమంది హోమ్ గార్డుల వెత

image

AP: పోలీస్, రవాణా, RTC విభాగాల్లోని 16వేల మంది హోమ్ గార్డులు జీతాల కోసం 10రోజులకు పైగా ఎదురుచూస్తున్నా ఫలితం కనిపించడం లేదు. సాధారణంగా ప్రతినెల 1,2 తేదీల్లోనే వీరికి జీతం అందుతుంటుంది. ఈ శాఖల్లోని ఇతర ఉద్యోగులకు CFMS ద్వారా ఈనెల 11నే శాలరీ అందింది. వీరికి వేరే విభాగం నుంచి రోజుకు ₹710 చొప్పున నెలకు ₹21,300 వేతనం చెల్లించాల్సి ఉంది. కాగా సర్వర్ ఇష్యూతో జీతాలు ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

News April 13, 2026

నల్గొండ: ధాన్యం కుప్పలతో బైక్ స్కిడ్.. ఒకరి మృతి

image

మాటూరు గ్రామ పరిధిలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పల వల్ల జరిగిన ప్రమాదంలో అడవిదేవులపల్లికి చెందిన భద్రయ్య మృతి చెందారు. మిర్యాలగూడ – అడవిదేవులపల్లి రహదారిపై ధాన్యం పట్టాల వల్ల బైక్ అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రయ్య మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా నిరోధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.