News March 29, 2024
సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బండి సంజయ్

సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, కోరారు. విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని కోరారు. గత 27 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి సమ్మె విరమింపచేసేలా కృషి చేయాలని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News September 7, 2025
కరీంనగర్‌లో మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం

KNR DCC కార్యాలయంలో ఆదివారం జిల్లా మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు గాజుల సుకన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లాలోని బ్లాక్, మండల, పట్టణ మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు పాల్గొన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పార్టీ బలోపేతంపై చర్చించారు. నాయకురాళ్లు తమ అభిప్రాయాలు, సూచనలను పంచుకున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.
News September 7, 2025
కరీంనగర్: ఓపెన్ స్కూల్లో చేర్చాలి

స్వయం సహాయక సంఘాల సభ్యులను ఓపెన్ స్కూల్లో చేర్చాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మెప్మా, డీఆర్‌డీఓ అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, ఉల్లాస్ రిజిస్ట్రేషన్లపై శనివారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన సభ్యులందరినీ వెంటనే ఓపెన్ స్కూల్లో చేర్పించి, విద్యను ప్రోత్సహించాలని సూచించారు.
News September 6, 2025
ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకోవాలి: కలెక్టర్

ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్తపల్లిలో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మా) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వారిని భావి పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.