News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News March 19, 2026
జనగామ: మంజూరైనవి 5,647.. పూర్తయినవి 241..!

జనగామ జిల్లాలో రెండో విడతలో 5,647 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు 241 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, స్లాబ్ దశలో 2,920, పునాది దశలో 1128, మార్కింగ్ చేసినా పునాది పనులు కానివి 450 ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా 908 ఇండ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. పనులు నెమ్మదించిన ఇళ్లపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు.
News March 19, 2026
సౌదీ అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ దాడి

ప్రపంచంలోని అతిపెద్ద చమురు ఉత్పత్తి, ఎగుమతిదారు అయిన సౌదీకి చెందిన అరామ్‌కో రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. దీంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. నష్ట తీవ్రతపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని తెలిపారు. ‘సౌత్ పార్స్’పై అటాక్‌కు ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలపై ఇరాన్ వరుస <<19422796>>దాడులు<<>> చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
News March 19, 2026
కాసేపట్లో వర్షం..

TG: వచ్చే రెండు గంటల్లో (4.30PM వరకు) పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. వికారాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, యాదాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.


