News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News March 15, 2026

ఇదే ఊపు కొనసాగుతుంది: రోహిత్ శర్మ

image

భారత క్రికెట్ గత రెండేళ్లుగా సాధిస్తున్న విజయాలపై రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో మహిళల జట్టు WC నెగ్గడం, ఇటీవల మెన్స్ T20 WCను కైవసం చేసుకోవడం అద్భుతమని కొనియాడారు. ‘ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడటం ఉండదు’ అని ధీమా వ్యక్తం చేశారు. పురుషుల, మహిళల జట్లు రెండూ ప్రస్తుతం ఫుల్ ‘మొమెంటం’లో ఉన్నాయని, ఇదే ఊపు భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

News March 15, 2026

పదో తరగతి పరీక్షల కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

image

నంద్యాల జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సజావుగా జరిగేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. 130 పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా పత్రాలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సిబ్బందితో భద్రత, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.

News March 15, 2026

ఏలూరు: పండుగలు వస్తున్నాయ్.. కందిపప్పు ఇవ్వరా?

image

చౌకధరల దుకాణాల్లో పేదలకు ఇవ్వాల్సిన కందిపప్పు పంపిణీ ఏడాదికి పైగా నిలిచిపోయింది. ఏలూరు జిల్లాలో 1164 డిపోలలో 6.40 లక్షల కార్డుదారులు ఉండగా వారిలో ఎక్కువ మంది రేషన్ సరకులపైనే ఆధారపడుతున్నారు. ఉగాది,రంజాన్ ,శ్రీరామనవమి పండగల సమయంలోనూ కందిపప్పు ఇవ్వకపోవడంతో కార్డుదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చౌక దుకాణాల్లో కేజీ.రూ.67 ఉండగా.. బహిరంగ మార్కెట్లో కందిపప్పు రూ.120 నుంచి 140గా ఉంది.